ఆహా అన్‌స్టాపబుల్ షోతో బాలయ్య తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న విషయం తెలిసిందే. క్రేజీ గెస్టులతో..షోని రక్తికట్టిస్తున్నారు. అలాగే ఈ షోలో రాజకీయ నేతలు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ వచ్చారు.
అలాగే కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి వచ్చారు. తాజాగా అటు సినీ, ఇటు రాజకీయ రంగానికి చెందిన పవన్ గెస్ట్‌గా వచ్చారు. ఇక బాలయ్య-పవన్ కాంబినేషన్ ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అయితే టీడీపీ-జనసేన పొత్తులో భాగంగానే మొన్న పవన్‌ని చంద్రబాబు కలిశారని, ఇప్పుడు షో ద్వారా బాలయ్య-పవన్ కలిశారని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ తరుణంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య షోకు పవన్ వచ్చిన గ్లింప్స్ ను వదిలింది ఆహా. ఈ గ్లింప్స్‌లో ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు లేకుండా జాగ్రత్త పడి, ప్రోమోను రిలీజ్ చేశారు.
Nimmalamga kanapade nippukonda #Pawankalyan, Raajasaniki niluvetthu nidharshanam #NBK Oke stage meeda first time kalisithe……maatala thootaalu pelalsindhe..🔥🔥
Get ready for the craziest episode of #UnstoppableWithNBKS2 🤟🏻 #PawanKalyanOnAHA @PawanKalyan #NBKOnAHA pic.twitter.com/tcSL78lxM5— ahavideoin (@ahavideoIN) January 15, 2023