వందే భారత్ ఎక్స్​ప్రెస్​ను ప్రారంభించిన మోదీ

-

తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్‌ రైలు ప్రారంభమైంది. ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తొలి సెమీ హైస్పీడ్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కింది. సికింద్రాబాద్ – విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలును ఇవాళ ఉదయం దిల్లీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు, రైల్వే శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలు.. తెలుగు రాష్ట్రాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన బహుమానం అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ హయాంలో దేశంలో అద్భుతమైన ప్రగతి జరుగుతోందని చెప్పారు. ఇవాళ వందే భారత్ ఎక్స్​ప్రెస్​ రైలును ప్రారంభించుకోవడం సంతోషకరమని హర్షం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news