చిరంజీవి పుట్టిన రోజు గిఫ్ట్ ఇదే…!

-

ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా టైటిల్ ఇప్పటికి ప్రకటించక పోయినా సరే సినిమాకు సంబంధించి ఈ టైటిల్ ని ఖరారు చేసింది చిత్ర యూనిట్ అనే ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటుగా మోషన్ పోస్టర్ ని ఈనెల 22వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు విడుదల చేస్తున్నామని చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో తెలిపింది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటుగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తం నిర్మిస్తున్న ఈ సినిమా కు రాంచరణ్ తో పాటుగా నిరంజన్రెడ్డి కూడా నిర్మాతగా ఉన్నారు. ఈ సినిమాలో చిరంజీవి మావోయిస్టు గా నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news