ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 9 వేల 652 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 88 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గత 24 గంటల్లో 50 వేల మందికి పైగా కరోనా కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించారు. 9 వేల మందికి పైగా కరోనా వైరస్ నుంచి కోలుకుని బయటపడ్డారు అని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

గత రెండు మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న కరోనా వైరస్ కేసులు మళ్లీ నేడు ఒక్కరోజు లోనే పెరగడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ఏపీలో ఇప్పటివరకూ 29 లక్షల మందికి పైగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు. రెండు లక్షల 18 వేల మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని బయటపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 85 వేల 130 మంది రోగులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.