టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో.. మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు…. మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. హీరోగా ఎంత బాగా రాణిస్తున్నారో… తన భార్య ఉపాసన కూడా చాలా బాగా చూసుకుంటున్నారు హీరో రామ్ చరణ్. సింపుల్గా చెప్పాలంటే ది బెస్ట్ కపుల్స్ లిస్ట్ లో .. రామ్ చరణ్- ఉపాసన జంట మొదటి వరుసలో ఉంటుంది. వీరిద్దరికీ పెళ్లి అయ్యి దాదాపు 8 ఏళ్ళు దాటింది.
అయితే ఇంకా పిల్లల విషయంలో ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు. దీంతో వీరిద్దరు ఎక్కడికి వెళ్లిన పిల్లలు ఎప్పుడు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పిల్లల విషయంలో క్లారిటీ ఇచ్చింది ఉపాసన.
పిల్లల విషయం తన వ్యక్తిగతమని చెప్పుకొచ్చింది ఉపాసన. దీనిపై చాలామంది అడుగుతున్న ఇప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని తేల్చిచెప్పింది. ఇప్పుడు దానికి సమాధానం చెప్పి దాన్ని సెన్సేషన్ చేయడం ఇష్టం లేదని పేర్కొంది. దీనికి సరైన సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని వెల్లడించింది. కాగా రామ్ చరణ్, ఉపాసనకు 2012లో వివాహం జరిగింది.