ఆధార్ లో అడ్రెస్ ని మార్చుకోవాలా…? ఇలా ఈజీ..!

-

మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు కూడా ఒకటి. ఆధార్ వలన ఎన్నో ఉపయోగాలు వున్నాయి. బ్యాంక్ అకౌంట్ ని ఓపెన్ చేసేందుకు మొదలు ఆధార్ ఎన్నో వాటికి ఎంతో అవసరం ఆధార్. అయితే ఆధార్‌ కార్డులో చిరునామాను మార్చుకోవాలా..? అయితే ఈజీగా మీరు మీ అడ్రెస్ ని మార్చేయచ్చు. అదెలానో ఇప్పుడు చూద్దాం.

మీరు ఆధార్‌లోని చిరునామాను అప్‌డేట్ చేయడం ఈజీ. ఏ ఇబ్బంది లేకుండా మార్చేసుకోవచ్చు. అది కూడా మీరు ఈజీగా ఆన్ లైన్ లో చేసుకోవచ్చు. ఇక వివరాలని చూస్తే.. గతం లో చిరునామాను అప్‌డేట్ చేయడానికి వ్యక్తిగత చిరునామా రుజువును సబ్మిట్ చెయ్యాల్సి వుంది. కానీ ఇప్పుడు చిరునామాను మార్చడానికి మీ చిరునామా రుజువును ఇవ్వక్కర్లేదు.

మీ ఇంటి పెద్ద చిరునామాను రుజువుగా చూపిస్తే చాలు. ఇంటిపెద్ద పేరు, దరఖాస్తుదారుడి పేరు, వారిద్దరి మధ్య సంబంధం గురించి చూపేలా ఏదైనా ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఇక ఎలా అడ్రెస్ ని అప్డేట్ చెయ్యాలో చూసేద్దాం. ఆధార్ కార్డు లో చిరునామా మార్చేందుకు రేషన్ కార్డ్, మార్క్ షీట్, వివాహ ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ వంటి డాక్యుమెంట్స్ ని ప్రూఫ్ గా తీసుకెళ్లండి. కుటుంబ అధిపతి (HOF)తో OTP ద్వారా ఈ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అభ్యర్థనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి కుటుంబ పెద్దకు 30 రోజుల సమయం ఇస్తారు. ఇలా HoF ఆధారిత ఆన్‌లైన్ చిరునామా అప్‌డేట్‌ను తీసుకు రావడం వలన చాలా మందికి హెల్ప్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news