తెలంగాణ అమ్మాయితో శర్వానంద్ పెళ్లి.. నిజమెంత..?

-

గత ఏడాది నుంచి చాలామంది యంగ్ హీరోలు, హీరోయిన్లు పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యంగ్ హీరో శర్వానంద్ కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయబోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న శర్వానంద్ వయసు 38 సంవత్సరాలు… నాలుగు పదుల వయసుకు చేరువలో ఉన్న శర్వానంద్ ఎప్పుడు వివాహం చేసుకుంటాడు అంటూ ఎప్పుడు వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.. అంతేకాదు అన్ స్టాపబుల్ సీజన్ 2 కి గెస్ట్ గా వచ్చిన సందర్భంలో కూడా బాలయ్య బాబు ఇదే ప్రశ్న అడగగా మాట దాటవేసే ప్రయత్నం చేశారు శర్వానంద్.

ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. శర్వానంద్ పెళ్లికి ఒప్పుకున్నాడట . అంతేకాదు మ్యాచ్ కూడా ఫిక్స్ అయిందని సమాచారం. వధువు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వార్తలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయిగా మాత్రమే తెలిసింది ఇంకా అమ్మాయి పూర్తి వివరాలు తెలియలేదు ఈ ఏడాది వేసవిలో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. పక్క శర్వానంద్ లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు అని కూడా సమాచారం. రెడ్డి సామాజిక వర్గం అమ్మాయితో శర్వానంద్ ఏడడుగులు వేయబోతున్నారట.

అమ్మాయి వర్క్ ఫ్రం హోం పేరిట ప్రస్తుతం హైదరాబాదులోనే ఉంటుందని సమాచారం. ఇప్పటివరకు ఈ వార్తలు వైరల్ అవుతున్నాయి కానీ ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడ లేదు. మరి ఇందులో ఎంత నిజం ఉంది తెలియాలి అంటే శర్వానంద్ నోరు విప్పక తప్పదు. ఇక శర్వానంద్ విషయానికి వస్తే చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఆ తర్వాత మంచి స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆపై కమర్షియల్ హీరోగా ఎదిగాడు. గత ఏడాది ఒకే ఒక జీవితం సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈయన ప్రజెంట్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్ లో రెండు సినిమాలు చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news