అయోధ్య కేసులో తీర్పు ఏకగ్రీవంగా రానున్నట్టు తెలుస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం అయోధ్య తీర్పును ఏకగ్రీవంగా ఆమోదించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఐదుగురు న్యాయమూర్తులు తీర్పుపై ఏకాభిప్రాయానికి రాగా తీర్పు చదవడం కూడా ప్రారంభమైంది. ఈ మేరకు ఇప్పటికే ధర్మాసనంలోని మొత్తం ఐదుగురు న్యాయమూర్తులు తీర్పు ప్రతులపై సంతకాలు చేసినట్టు తెలుస్తుంది. అన్ని మతాలకు రక్షణ కల్పించేందుకే సుప్రీంకోర్టు కట్టుబడినట్టు ఈ సందర్భంగా జస్టిస్ గొగోయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక తీర్పులో సుప్రీం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళీ స్థలంలో మసీదు నిర్మాణం జరగలేదని కోర్ట్ అభిప్రాయపడింది. బాబ్రీ మసీదుని బాబర్ నిర్మించారని పిటీషన్ దాఖలు చేసిన షియా బోర్డు తీర్పుని కోర్ట్ కొట్టేసింది. వివాద స్థలంలో… షియా బోర్డు కి ఎలాంటి హక్కు లేదని కోర్ట్ స్పష్టం చేసింది. గతంలో ఉన్న స్థలం ముస్లింలది కాదని పేర్కొంది. బాబర్ సైనికులు మసీదుని నిర్మించారు. వివాదాస్పద స్థలంలో పూజలు చేసే హక్కు నిర్మోహి అఖాడాకు లేదని కోర్ట్ స్పష్టం చేసింది. కట్టడం కింద మరో నిర్మాణం ఉన్న ఆనవాళ్లు ఉన్నాయి.
మతపరమైన విశ్వాసాలతో ధర్మాసనంకు సంబంధం లేదు… ఆధారాలతో ధర్మాసనం తీర్పుని వెల్లడిస్తుందని… వివాదాస్పద స్థలంలో గతంలో నిర్మాణం ఉండేది కానీ… అది ముస్లింలది కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. రాముడు అయోధ్యలోని జన్మించాడు అని చెప్పిన ధర్మాసనం మసీదు కోసం మందిరాన్ని కూల్చినట్టు ఆధారాలు లేవు అని చెప్పింది. పురావస్తు నివేదికలు మసీదు ఈద్గా ఉన్నట్టు ఆనవాళ్లు లేవని స్పష్టం చేసింది.
మసీదు ఉందనేది ముస్లింల వాదన లేదనేది హిందువుల వాదన… వివాదాస్పద స్థలానికి సంబంధించి ఎవరి దగ్గర ఉంటె వాళ్ళే పూజలు చేసుకోవచ్చు అని చెప్పింది 1857 నుంచి పూజలు చేయకుండా హిందువులను ఎవరూ ఆపలేదు అని చెప్పిన కోర్టు. ఆ స్థలాన్ని ముస్లింలు ఎప్పుడు వదిలిపెట్టలేదని కూడా పేర్కొంది. అక్కడ నమాజ్ చేసుకునే హక్కు ముస్లింలకు ఉంది పూజలు చేసుకునే హక్కు హిందువులకు ఉంది… ఆ భూమి పత్రాలు ఎవరి దగ్గర ఉంటె వాళ్ళే భూ హక్కు దారులు అని స్పష్టం చేసింది.
వివాదాస్పద స్థలం తమదే అని ముస్లిం సంస్థలు నిరూపించలేకపోయాయి అని ధర్మాసనం పేర్కొంది. వివాదాస్పద స్థలం హక్కులు తేల్చాల్సింది రికార్డులే అని పేర్కొంది. రామ్ చబుత్రా… సీతారా సోయ్ దగ్గర 1985 కి ముందు పూజలు జరిగాయని ధర్మాసనం పేర్కొంది. బాబ్రీ కూల్చివేత రాజ్యాంగ విరుద్ధం, దానిని చట్టం అనుమతించదు అని కూడా ధర్మాసనం తెలిపింది.