ఏపీ సీఎం వైఎస్.జగన్మోహన్‌రెడ్డి మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో చేపట్టిన సమీక్షలో అధికారులకు పలు కీలక పథకాలపై అనేక సూచనలు చేశారు. ఈ క్రమంలోనే ఉగాది నాటికి పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని.. ఈ పథకం మనకు మానస పుత్రిక వంటిదని, ఈ పథకాన్ని విజయవంతం చేయడానికి అధికారులంతా కృషి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.
దేశమంతా ఈ కార్యక్రమంపై మాట్లాడుకుంటోదని, దీన్ని బట్టే మన పాలన ఎలా ఉందో అర్థమవుతోందని అన్నారు. అలాగే వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంపై సైతం సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు జగన్ పలు కీలక సూచనలు చేశారు. సమీక్ష సందర్భంగా జగన్ ప్రతి గ్రామంలోనూ సోషల్ ఆడిట్ జరగాలని ఆదేశించారు.
ఉగాది నాటికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని జగన్ ఆదేశించారు. మన పరిపాలన ఎలా ఉందో ఈ కార్యక్రమం ద్వారా దేశం మొత్తం మాట్లాడుకుంటోంది. ఈ కార్యక్రమం కోసం ఇప్పటివరకూ చేసిన ప్రయత్నాలు ఒక ఎత్తు అయితే, వచ్చే నాలుగు నెలల్లో మనం చేయాల్సిన ప్రయత్నాలు ఇంకో ఎత్తు అని జగన్ తెలిపారు.
ఇక అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే గుర్తించాలని… లేని పక్షంలో అందుబాటులో ఉన్న భూములను వెంటనే కొనుగోలు చేయాలని కూడా ఆయన ఆదేశించారు. ఇక ఇళ్లస్థలాలు ఇచ్చే అంశంపైనే కలెక్టర్లు రాత్రి, పగలు ఆలోచించాలని కూడా జగన్ సూచించారు. నవంబర్ 20 నుంచి బియ్యంకార్డు, పెన్షన్, ఆరోగ్యశ్రీ, ఫీజురియింబర్స్ మెంట్ లబ్ధిదారుల ఎంపిక జరగాలన్నారు.
గ్రామ సచివాలయంలో పర్మినెంట్‌గా డిస్ ప్లే బోర్డు ఉండాలి. వివిధ పథకాలకు అర్హులైన వారి జాబితాను అక్కడ ఉంచాలని సూచించారు. ఇక అర్హులు వివిధ పథకాలకు ఎలా ? దరఖాస్తు చేయాలి ? ఎవరికి చేయాలనే సమాచారం కూడా అందులోనే ఉంచాలన్నారు. అలాగే కౌలు రౌతులకు సంబంధించిన గడవును డిసెంబర్ 15 వరకు పెంచుతున్నాం. ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వాటిపై అవగహన పెంచుకోడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు.