TSRTC: గడువు దాటితే వేటు త‌ప్ప‌దు..

-

తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన డెడ్‌లైన్ మంగళవారం అర్థరాత్రితో ముగియనుంది. విధుల్లో చేరాలని గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కార్మికులకు మంచి అవకాశం కల్పించింది. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విధుల్లో చేరడానికి మూడు రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు.

ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే వేటు త‌ప్ప‌ద‌ని తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తే లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. దీనిని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే మిగిలిన 5000 రూట్లలోనూ ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తుంద‌ని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news