ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ తీసుకునే కొన్ని నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. సంక్షేమ పథకాల విషయంలోఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి తీవ్రంగానే శ్రమిస్తున్న జగన్ వాటి అమలుకోసం ప్రభుత్వ ఖజానాను నింపే పనిలో పడ్డారు. అర్ధిక లోటు ఉన్నా సరేఇచ్చిన హామీల విషయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నారాయన. ఇక అది అలా ఉంటే ప్రభుత్వంలో ఉండే తన టీం విషయంలో కూడా జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు వచ్చినా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారుల కోసం త్వరిత గతిన నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆయన బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏరి కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబ్రమణ్యంని బదిలీ చేశారు. ఇప్పుడు ఆయన స్థానంలో సీనియర్ మహిళా అధికారి నీలం సహానీని నియమించారు. ఉన్నపళంగా జగన్ ఆమెకు కబురు పెట్టడంతోనేరుగా ఢిల్లీ నుంచి జగన్ నివాసానికి చేరుకున్నారు సహాని. ఆమెకు సమర్దవంతమైన అధికారిగా పేరుండటం, ఏదైనా పని అప్పగిస్తే పూర్తి చేసే సమర్దత ఉంటంతో జగన్ ఆమెని ఎంపిక చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె సామర్ద్యంతో పాటు మరో కారణం కూడా ఉందని అంటున్నారు.
రాజకీయంగా జగన్ మహిళలకు ప్రభుత్వంలో పెద్ద పీట వేసారు. ముగ్గురు మహిళలను ఆయన మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఆర్కే రోజా, వాసిరెడ్డిపద్మలకు కీలక బాధ్యతలు అప్పగించారు. కొవ్వూరు నుంచి విజయం సాధించిన తానేటి వనితకు, అటు సుచరితకు హోం మంత్రి, పుష్పశ్రీ వాణికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు జగన్. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ సిఎస్ గా మహిళా అధికారిని నియమించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విదుల్లో ఉన్న ఆమె ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కు చెందినఅధికారి. కేంద్రంలో సామాజిక న్యాయం సాధికారిత శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.