Upendra : చిరంజీవితో ఆ విషయంలో ఉపేంద్ర రిగ్రెట్.. రివీల్ చేసిన కన్నడ సూపర్ స్టార్..

-

విలక్షణ కథానాయకుడిగానే కాదు.. రచయిత, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు శాండల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్ర. తెలుగు వారికి కూడా ఈయన సుపరిచితం. గతంలో పలు చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన ఉపేంద్ర.. వెరీ బిజీ ఆర్టిస్ట్. ఈయన చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకులను ‘గని’ ఫిల్మ్ తో పలకరించబోతున్నారు. ఈ సందర్భంగా మూవీ ఫంక్షన్ లో ఉపేంద్ర కీలక వ్యాఖ్యలు చేశారు.

తనకు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో ఎంతో అనుబంధం ఉందని పేర్కొన్నారు ఉపేంద్ర. నాగేంద్ర బాబు, అల్లు అర్జున్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న తాను ‘గని’ చిత్రంతో వరుణ్ తేజ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా బాగుందన్నారు. అయితే, తాను ఇప్పటికీ ఒక విషయంలో బాధపడుతానని అల్లు అరవింద్ కు చెప్పారు. తనకు గతంలో అశ్వినిదత్ ప్రొడ్యూసర్ మెగా స్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చిందని, కానీ, అప్పుడు తానే వదులుకున్నానని వివరించాడు.

‘గని’ చిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, నదియా తదితరులు కీలక పాత్రలు పోషించగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతం అందించారు. ఈ నెల 8న సినిమా విడుదల కానుంది. సాయిమంజ్రేకర్ ఇందులో హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నారు. చూడాలి మరి.. ఈ చిత్రం ఏ మేరకు ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో..

Read more RELATED
Recommended to you

Latest news