ఏపీకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త..రూ.10కే ఎల్ఈడీ బల్బులు పంపిణీ

-

ఏపీ గ్రామాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. కేంద్రం ప్రవేశ పెట్టిన గ్రామ ఉజ్వల పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఏపీప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం ద్వారా ఎల్‌ఈడీ బల్బులను భారీగా పంపిణీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కేంద్రం ఈ పథకానికి దేశంలో ఐదు రాష్ట్రాలనే ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణతో పాటు యూపీ, బీహార్‌, కర్ణాటకలు ఉన్నాయి.

ఈ పథకం ద్వారా ఏపీతో కలిపి ఐదు రాష్ట్రాల్లో కోటీ ఎల్‌ఈడీ బల్బులు పంపినీ చేయాలని ఈఈఎస్‌ఎల్‌ అనుబంధ సంస్థ సీఈఎస్‌ఎల్‌ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏపీలోని అన్ని గ్రామాల్లో ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేస్తున్నారు. ఎల్‌ఈడీ బల్బుల సామర్థ్యం విషయానికి వస్తే.. సాధారణ బల్బులతో పోల్చినప్పుడు 88 శాతం ఎక్కువ విద్యుత్‌ ను వినియోగం ఉంటుంది. అలాగే కాంతి కూడా ఎక్కువ ఉంటుంది. సీఎఫ్‌ఎల్‌ బల్బులతో పోలిస్తే.. ఈఎల్‌ఈడీలు తక్కువ వేడిని విడుదల చేస్తాయి. గ్రామాల్లో వినియోగదారుడు ఒక్కో దానికి రూ.10 చెల్లిస్తే.. ఎల్‌ఈడీ బల్బు అందజేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news