క్రెడిట్‌ కార్డు వినియోగదారులుకు శుభవార్త.. ఆర్టీబీ కీలక నిర్ణయం

-

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూపీఐ అకౌంట్లకు క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసుకునేలా అనుమతి కల్పించనున్నట్టు ఆర్‌బీఐ వెల్లడించింది. తాజాగా ప్రకటించిన మానిటరీ పాలసీలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈ విషయాన్ని పేర్కొన్నారు.. దేశీయ రూపే క్రెడిట్ కార్డులను తొలుత యూపీఐ అకౌంట్లకు లింక్ చేసుకునేలా అనుమతి ఇస్తామని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు. ఆ తర్వాత మాస్టర్‌కార్డు, వీసా వంటి ఇతర క్రెడిట్ కార్డులను కూడా యూపీఐ అకౌంట్లకు అనుసంధానం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇప్పటి వరకు యూపీఐ అకౌంట్లకు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్ చేసుకునే అనుమతి కస్టమర్లకు ఉండేది.

RBI allows linking of credit cards with UPI: Details here | NewsBytes

తాజాగా ఈ నిర్ణయంతో డిజిటల్ పేమెంట్లు మరింత పుంజుకోనున్నాయి. కస్టమర్లు మరింత సౌకర్యవంతంగా ఈ పేమెంట్లను చేసుకోనున్నారు. ‘యూజర్లు ప్రస్తుతం డెబిట్ కార్డులను వారి సేవింగ్స్, కరెంట్ అకౌంట్లను యూపీఐకి లింక్ చేసుకోవడం ద్వారా లావాదేవీలు చేసుకునేందుకు వీలుంటుంది. ఇక నుంచి యూపీఐ ప్లాట్‌ఫామ్‌కి క్రెడిట్ కార్డులను లింక్ చేసే ప్రతిపాదనను తీసుకొస్తున్నాం. రూపే క్రెడిట్ కార్డులను యూపీఐ(UPI)కి లింక్ చేయడం ద్వారా ఈ ప్రక్రియను అమల్లోకి తీసుకొస్తాం’’ అని ఆర్‌బీఐ తెలిపింది. అయితే క్రెడిట్ కార్డులను వాడుతూ యూపీఐ లావాదేవీలు చేసినందుకు మర్చెంట్ డిస్కౌంట్ రేటు(ఎండీఆర్) ఎలా అప్లయి అవుతుందో మాత్రం స్పష్టత లేదు.

Read more RELATED
Recommended to you

Latest news