ఉప్పెన దర్శకుడి నెక్స్ట్ సినిమా ఆ స్టార్లతోనే..?

Join Our Community
follow manalokam on social media

ఒక సినిమా రిలీజ్ కి ముందే అందులో నటించిన హీరో హీరోయిన్లకి స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టిందంటే అది ఉప్పెన సినిమానే కావచ్చు. ఈ సినిమాకి ఇంతలా హైప్ రావడానికి గల చాలా కారణాల్లో ఆ చిత్ర దర్శకుడు బుచ్చిబాబుది పెద్ద పాత్రే. ఆ విషయం ప్రతీచోట అందరూ చెబుతూనే ఉన్నారు. ఈ రోజు సినిమా రిలీజయ్యింది. విడుదలైన అన్ని చోట్ల నుమ్డి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

తాజా సమాచారం ప్రకారం బుచ్చిబాబుకి వరుస్ద ఆఫర్లు వస్తున్నాయట. ఐతే తన రెండవ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లోనే ఉంటుందని తెలుస్తుంది. బుచ్చుబాబు మీద ఉన్న నమ్మకంతో మైత్రీ మూవే మేకర్స్ నిర్మాతలు, ఈ సారి స్టార్ హీరోతో సినిమా చేయాలని అనుకుంటున్నారట. అందుకోసం ఆల్రెడీ మూడు ఆప్షన్లు ఇచ్చారట. ఆ ఆప్షన్లలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారట. అంటే అన్నీ కుదిరితే బుచ్చుబాబు తన రెండవ సినిమాని ఎన్టీఆర్ తో తెరకెక్కించే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.

TOP STORIES

వనదేవతల జాతర.. మినీ మేడారం

సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఫిబ్రవరి 24 నుంచి 27 వరకు అమ్మవార్లకు పూజలు నిర్వహిస్తున్నారు. మండమేలిగే పండగ సందర్భంగా...