UPSC జాబ్ నోటిఫికేషన్… వివరాలు ఇవే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నోటిఫికేషన్ ని విడుదల చేసింది. దీనిలో అసిస్టెంట్ డైరెక్టర్, అగ్రికల్చరల్ ఇంజనీర్, అసిస్టెంట్ జియాలజిస్ట్ పోస్టులు భర్తీ చేస్తోంది. ఇక ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలలోకి వెళితే.. దీనిలో మొత్తం 23 ఖాళీలు వున్నాయి. ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తుకు సెప్టెంబ‌ర్ 16 ఆఖ‌రు తేదీ. పోస్టుల వివరాలలోకి వెళితే… అసిస్టెంట్ డైరెక్టర్ – 2 పోస్టులు, వ్యవసాయ ఇంజనీర్ – 1 పోస్ట్, అసిస్టెంట్ జియాలజిస్ట్ – 20 పోస్టులు వున్నాయి.

UPSC
UPSC

ఇక విద్యార్హతలు చూస్తే… అసిస్టెంట్ డైరెక్టర్ (ప్లాంట్ పాథాలజీ) కి అయితే గుర్తింపు పొంద‌ని యూనివ‌ర్సిటీలో పాథాల‌జీలోగాని, వ్య‌వ‌సాయంలోగాని ఎమ్మెసీ పూర్తి చేయాలి. లేదా బోట‌నీలో ఎమ్మెసీ చేయాలి. కనీసం మూడు సంవ‌త్స‌రాలు మొక్కల వైరస్, మొక్కల బ్యాక్టీరియాకు సంబంధించిన దేశీయ మరియు విదేశీ మొక్కల వ్యాధుల రీసెర్చ్ లో అనుభవం ఉండాలి. అదే అసిస్టెంట్ జియాలజిస్ట్ పోస్టుకి అయితే గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాలయం నుంచి జియాలజీ లేదా అప్లైడ్ జియాలజీ లేదా జియో ఎక్స్‌ప్లోరేషన్ లేదా మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ లేదా ఇంజనీరింగ్ జియాలజీ లేదా జియో-కెమిస్ట్రీ లేదా మెరైన్ జియాలజీ లేదా ఎర్త్ సైన్స్ & రిసోర్స్ మేనేజ్‌మెంట్ లేదా ఓషనోగ్రఫీ మరియు కోస్టల్ ఏరియా స్టడీస్ (కోస్టల్ జియాలజీ) లేదా ఎన్విరాన్‌మెంటల్ జియాలజీ లేదా జియో-ఇన్ఫర్మేటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ క‌లిగి ఉండాలి.

అదే వ్యవసాయ ఇంజనీర్ (Instrumentation) కి అయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇనిస్టిట్యూట్ నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీలో డిగ్రీ ఉండాలి. అలానే ఆటోమేటిక్ కొలత మరియు నియంత్రణల కొరకు ఎలక్ట్రానిక్స్ మరియు ఎలక్ట్రికల్ పరికరాల ప‌నిలో రెండేళ్ల అనుభవం ఉండాలన్నారు. పూర్తి వివరాలని www.upsconline.nic.in. వెబ్‌సైట్ లో చూసి ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Latest news