మెడిసిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్.. బిడ్డ ఒళ్ళంతా నల్లటి జుట్టు..!

-

నాలుగు నెలల పసి బిడ్డ అరుదైన సమస్యతో బాధపడుతున్నాడు. మెడిసిన్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా తనకి ఈ సమస్య వచ్చింది. ఇక దీని కోసం పూర్తిగా చూస్తే… యునైటెడ్ స్టేట్స్ కి సంబంధించిన ఒక నాలుగు నెలల బిడ్డ చాలా అరుదైన జెనిటిక్ కండిషన్ తో ఇబ్బంది పడుతున్నాడు.

తన ఒళ్ళంతా కూడా నల్లగా జుట్టు ఎదుగుతోంది. దీనికి గల కారణం మెడికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అని తెలుస్తోంది. తన మొదటి నెలలో కాగ్నెటల్ హైపర్ ఇన్సులినిసం ఇచ్చి డయాగ్నోసిస్ చేశారు అయితే చాలా రేర్ కండిషన్ కారణంగా పాంక్రియాస్ నుండి ఇన్సులిన్ అధిక మోతాదులో ప్రొడ్యూస్ అయ్యిపోయింది.

దీంతో షుగర్ లెవెల్స్ తగ్గిపోయాయి. అయితే ఈ సమస్య 50 వేల మందిలో ఒకరికి వస్తుందని వైద్యులు అంటున్నారు. అయితే మెడికేషన్ ఇంప్రూవ్ అయినా సరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. పొడవాటి నల్ల జుట్టు ఒళ్లంతా కూడా వచ్చేసింది. ఈ బేబీ ఫొటోస్ ని ఒక పోలీస్ ఆఫీసర్ రీసెంట్ గా టిక్ టాక్ లో షేర్ చేశారు.

దీనితో చాలా మందికి ట్రోలింగ్ కూడా చేశారు. బిడ్డ గురించి చూడకుండా వివిధ రకాల కామెంట్లు చేశారు. ఇటువంటి పిల్లల్ని వదిలేయాలని ఒక నెటిజన్ కామెంట్ పెడితే తను నా బిడ్డ అని ఇతరులు చెప్పిన మాటలు వినను అని తల్లి చెప్పింది. అదే విధంగా మరొకరు వ్యాక్సింగ్ ఇవ్వాలని చెప్పారు దానికి కూడా అవసరం లేదు అని కామెంట్ చేశారు ఆమె. ఆమె బిడ్డ గురించి ఆమె చాలా ఆనందంగా వున్నాను అని కూడా తల్లి చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news