గతం లో రిచర్డ్‌ నిక్సన్‌,  బిల్‌ క్లింటన్‌లు…ఇప్పుడు ట్రంప్

-

ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు రోజు రోజుకీ మారిపోతున్నాయి. రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొంది. అగ్ర రాజ్యం అమెరికాలో సైతం రాజకీయ పరిస్థితులు  ప్రభుత్వానికి ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ మీద అభిశంసన ప్రక్రియ మొదలైంది. గతంలో రిచర్డ్ నిక్సన్ , బిల్ క్లింటన్ లు ఇదే తరహాలో అభిశంసనకి గురయ్యి పదవులు పోగొట్టుకున్నారు. ప్రస్తుతం…

ట్రంప్‌ పై ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ ఈ అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ట్రంప్ తన రాజకీయ ప్రయోజనాల కోసం దేశ ద్రోహానికి పాల్పడ్డారని డెమోక్రటిక్ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. అభిశంసన తీర్మానానికి దిగువ సభ లో ఎక్కువ  మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో సర్వాత్రా ఉత్ఖంట నెలకొంది. ఇక సెనేట్ లో తీర్మానం ఆమోదం పొందితే అభిశంసన ప్రక్రియ పూర్తయినట్టే.

దిగువ సభ కంటే కూడా సెనేట్ లో రిపబ్లికన్లకి మెజారిటీ ఎక్కువ ఉంటంది.  మరి ఈ విధంగా ఆలోచిస్తే ట్రంప్ అభిశంసన ప్రక్రియ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంకొన్ని రోజుల్లో ట్రంప్ సెనేట్ లో విచారణ ఎదుర్కోవడానికి సిద్దంగా ఉన్నారు. ఇదిలాఉంటే ఈ అభిశంసన ప్రక్రియని నిలిపి వేయమంటూ గతంలో ట్రంప్ ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసి కి లేఖని కూడా పంపిన విషయం విధితమే.

Read more RELATED
Recommended to you

Latest news