అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరపడుతున్న కొద్దీ అధ్యక్షుడు ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్‌ల మధ్య ఉత్కంఠభరిత పోటీ నెలకొంది..అధ్యర్థుల మధ్య మొదటి ప్రెసిడెంటల్ డిబేట్ వాడి వేడిగా జరిగింది..చర్చలో ఒకరిపై ఒకరు పైచేయి సాధించామని అభ్యర్థుల ప్రచార కమీటీలు ప్రకటించుకున్నాయి..ట్రంప్‌కు కరోనా సోకితగ్గడంతో ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల మధ్య రెండో డిబేట్‌ను రద్దు చేశారు..కరోనాతో ఆస్పత్రిలో చేరిన ట్రంప్ కొద్దీ రోజులు ప్రచారంకు దూరమయ్యారు..దీంతో డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జోబిడెన్ ప్రచారంలో దూకుడు పెంచాడు..కరోనాతో ప్రచారంలో కాస్తా వెనుకబడిని ట్రంప్ ఇప్పుడు కొత్త ఎత్తుగడకు తెర తీసారు..భారతీయ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియోతో పాటు రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ త్వరలో భారత్‌కు రానున్నారు..
ప్రస్తుతం చైనా సమస్యతో పాటు వివిధ విషయాల్లోనూ భారత్, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు అమెరికాలో భారత రాయబారి తరన్‌జిత్ ..యూఎస్ భారత్ మధ్య చర్చల కోసం ఈ నెల 26,27తేదీల్లో వాళ్లిద్దరూ భారత్ కు వస్తున్నట్టు తరన్‌జిత్ సింగ్ సంధూ తెలిపారు..పాంపియో భారత పర్యటనలో రక్షణ సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరుగుతాయన్నారు తరన్‌జిత్..ఈ పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందాలు జరుగనున్నాయని యూఎస్ చెప్పినప్పటికి భారత ఓటర్లను ప్రభావితం చేయడమే యూఎస్ మంత్రుల ముఖ్యఉద్దేశ్యంగా ఉందని జోబిడెన్ వర్గం ఆరోపిస్తుంది.