యూఎస్, జపాన్ దేశాల్లో భూకంపాలు…

-

శక్తివంతమైన భూకంపాలు యూఎస్, జపాన్ దేశాల్లో సంభవించాయి. దీంతో ఆయా దేశాాల భూకంప ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ఇటీవలనే జపాన్ లో భూకంపం సంభవించింది. జపాన్ దేశంలో పాటు, అమెరికా కోస్టల్ ప్రాంతం భూకంప ప్రభావిత ప్రాంతాల జాబితాలో ఉండటంతో ఈ ప్రాంతాల్లో తరుచుగా భూకంపాలు సంభవిస్తున్నాయి.

అమెరికా తూర్పు ప్రాంత కోస్టల్ తీరంలోని ఓరేగాన్ రాష్ట్రంలో బుధవారం భూకంపం సంభింవించింది. రిక్టర్ స్కేల్ పై 5.8 తీవ్రతతో భూకంప వచ్చింది. భూకంప కేంద్రం భూమికి 10కిలో మీటర్ల లోతులో కేంద్రీక్రుతం అయినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.

మరోవైపు జపాన్ ను కూడా భూకంప బయపెట్టింది. జపాన్ లోని పుకుషిమా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.0 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అక్కడి మెటిరోలాజికల్ డిపార్ట్ మెంట్ తెలిపింది. భూకంప కేంద్రం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీక్రుతం అయినట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news