ఫేస్ బుక్ కు మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. 2021 ఫిబ్రవరి లో జరిగిన మయన్మార్ సైనిక తిరుగుబాటు సమయంలో… తమకు వ్యతిరేకంగా సాగిన విద్వేష పూరిత ప్రసంగాలు పోస్ట్ కాకుండా అడ్డుకోవడంలో విఫలమైందని… సోషల్ మీడియా సంస్థ అయిన ఫేస్ బుక్ పై రోహింగ్య శరణార్థులు 150 మిలియన్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు న్యాయ కంపెనీలు ఎడల్సాన్ పీసీ, ఎల్ ఎం సి లు రోహింగ్య శరణార్థుల తరఫున అమెరికాలోని కాలిఫోర్నియా స్థానంలో దావా వేశారు.
ఫేస్ బుక్ లో పోస్ట్ అయిన సంఘాలు తమ పట్ల హింసకు కారణమయ్యాయని ఇందులో పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి ఒకటో తేదీన తిరుగుబాటు జరిగిన తర్వాత మయన్మార్ సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ కాకుండా నిషేధం విధించడం సహా పలు చర్యలు తీసుకున్నట్లు ఫేస్బుక్ తెలిసింది. మూడో వ్యక్తి పోస్ట్ చేసిన సమాచారం పై చర్యలు చేపట్టకుండా అంతర్జాలం చట్టం.. ప్రకారం తమకు రక్షణ ఉందని స్పష్టం చేసింది. పిటిషన్ నవల కోర్టులో విజయం దక్కకకపోవచ్చని పలువురు నిపుణులు కూడా చెబుతున్నారు.