సోంపుతో డయాబెటీస్‌కు చెక్‌!

-

సోంపుతో డయాబెటీస్‌ను కంట్రోల్‌ చేయవచ్చు. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సాధారణంగా మనం సోంపును ఆహారం జీర్ణం కావడానికి తీసుకుంటాం. అదేవిధంగా టైప్‌–2 డయాబెటీస్‌ను నియంత్రించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సోంపులో యాంటీఆక్సిడెంట్లతోపాటు అనేక పోషకాలు ఉన్నాయి. మాములుగానే టైప్‌–2 డయాబెటీస్‌ పేషెంట్లలో బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయి.

ఇందులో విటమిన్‌ సీ, ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి డయాబెటీస్, గుండె జబ్బులు రాకుండా నివారిస్తాయి. రోజుకు రెండుసార్లు విటమిన్‌ సీ ట్యాబ్లెట్లను వేసుకుంటారు. దీనికి బదులుగా సోంపు గింజల్ని తింటే సీ విటమిన్‌ వల్ల డయాబెటీస్‌ లెవెల్స్‌ తగ్గుతుంది. ఇది ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు ధ్రువీకరించారు. బంగ్లాదేశ్‌లో జరిపిన పరిశోధనలో ఎలుకలకు పుదీనా, సోంపు గింజల్ని తినిపించారు.దీంతో వాటి బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌… కొంతవరకూ తగ్గాయి. మందులు వాడటం కంటే ఇది మంచిదంటున్నారు . సోంపు మొక్క, సోంపు గింజల్లో ఫైబర్‌ ఎక్కువ. ఇది మన శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది.

ఇందులో ఉండే మరో యాంటీ ఆక్సిడెంట్‌ బీటా కెరోటిన్‌… కొలెస్ట్రాల్‌ లెవెల్స్‌ తగ్గేందుకు పోరాడుతోంది. సోంపులో కేన్సర్‌ను నిరోధించే లక్షణాలు కూడా ఉన్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. కానీ, ఒకవేళ కేన్సర్‌ హై స్టేజ్‌లో ఉన్నవారు మాత్రం సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు డాక్టర్లు. సోంపు గింజల్ని రోజూ కొద్దిమొత్తంలోనే తీసుకోవాలనీ, అధికంగా తినడం అంత మంచిది కాదని చెబుతున్నారు. అలాగే… ప్రెగ్నెన్సీ ఉన్నవారు, పిల్లలకు పాలు ఇచ్చే తల్లులు సోంపు గింజల్ని తినవద్దని సూచిస్తున్నారు. ఇతర ఔషధాలను వాడకం కంటే ఇలాంటి నేచురల్‌ మొక్కల ద్వారా వచ్చిన పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యం సురక్షితంగా ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news