ఫ్యాన్ గండం..హెల్మెట్ లతో ఉస్మానియా డాక్టర్లు…!

-

సాధారణంగా బైక్ పై ప్రయాణించేవారు రోడ్డు ప్రమాదాల నుండి తమను తాము కాపాడుకునేందుకు హెల్మెట్లు ధరిస్తుంటారు. కానీ తాజాగా ఉస్మానియా ఆసుపత్రిలో డాక్టర్లు హెల్మెట్లు ధరించి వైద్యం చేయడం వైరల్ అవుతోంది. ఆస్పత్రిలోని వైద్యులందరూ ఈ రోజు హెల్మెట్ ధరించి ఆస్పత్రికి వచ్చారు. దానికి కారణం… నిన్న హాస్పిటల్ లో సీలింగ్ ఫ్యాన్ తలపై పడి వైద్యురాలి తలకు గాయం అయింది. దాంతో శిథిలావస్థలో ఉన్న ఫ్యాన్లు ఎక్కడ తమపై పడతాయో అని ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు భయాందోళనకు గురవుతున్నారు.

ఈ నేపథ్యంలోనే హెల్మెట్ లు ధరించి ఆస్పత్రికి హాజరయ్యారు. అయితే ఇది ఒక రకంగా డాక్టర్లు ఆస్పత్రి శిథిలావస్థకు చేరుకోవడం పై నిరసన తెలుపుతున్నట్టు కనిపిస్తోంది. ఇలా హెల్మెట్ లు ధరించి వార్తల్లోకి ఎక్కితే అయినా ప్రభుత్వాలు స్పందించి వాటికి మరమ్మతులు చేస్తాయని డాక్టర్ లు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనిపిస్తోంది. ఇక ఆస్పత్రిలో డాక్టర్లు మాత్రమే కాకుండా రోగులు ఇతర సిబ్బంది సైతం ఫ్యాన్ గడ్డం గురించి ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news