ఉద్యోగాలు వస్తాయనుకుంటే.. బర్రెలు, గొర్రెలు ఇస్తామంటున్నారు – కాంగ్రెస్ నేత మధుయాష్కీ

-

హూజూరాబాద్ ఎన్నికల వేళ ప్రతిపక్షాలు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ నేత మధు యాష్కీ టీఆర్ఎస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోెగులు ఆశపడ్డారని, కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు అంటుందని టీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్లీనరీ మొత్తం కేసీఆర్ ని పొగడటానికే సరిపోయిందని, తెలంగాణ అమరవీరుల ఉసే లేదని కాంగ్రెస్ నేత మధుయాష్కీ టీఆర్ఎస్ పార్టీని విమర్శించారు. అమరులను ఒక్కరిని గుర్తు చేసుకోలేదని విమర్శించారు. తెలంగాణ వచ్చి ఏడేళ్ల అవుతుందని అయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్యల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగం పోతుందని యువకులు కలలు కన్నారని కానీ ప్రస్తుత తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఆగమైదన్నారు. ప్రాజెక్ట్ లు కట్టి కోటి ఎకరాలను మాగాణీ చేస్తామని టీఆర్ఎస్ గొప్పలు చెప్పిందని, ప్రస్తుతం రైతులు వరి పంటను వేయవద్దని అంటున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news