Uttam Kumar Reddy: కాలేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై వారం రోజుల్లో న్యాయవిచారణ: మంత్రి ఉత్తమ్

-

వారం రోజులలో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై న్యాయవిచారణకు ఆదేశిస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం తప్పుచేసిన వారిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చెప్పారు. మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ….కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో బిఆర్ఎస్ నేతలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నిస్తోందని కేంద్ర మంత్రి,బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను మంత్రి కొట్టిపారేశారు.

10 సంవత్సరాల పాటు బీజేపీ, టిఆర్ఎస్ కలిసే పనిచేశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మద్దతు ఇచ్చింది. కాళేశ్వరంపై కేంద్ర ప్రభుత్వం ఇన్ని రోజులు స్పందించలేదు. బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రాజెక్టుకు రుణం ఇచ్చింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిపోయి ఇప్పటికే నెలలు గడుస్తున్నాయి. అయినప్పటికీ కిషన్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టును ఎందుకు పరిశీలించలేదు? దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలపై విరుచుకుపడే దర్యాప్తు సంస్థలు.. టిఆర్ఎస్ సర్కారుపై విచారణ జరిపినపుడు ఎవరైనా ఆపారా? ” అని ప్రశ్నించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news