ఏపీ ఎన్నికలు జరిగేనా.. హైకోర్ట్ ఏం చెప్పనుంది ?

Join Our COmmunity

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం విడుదల చేసిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం మరోసారి హైకోర్టు ని ఆశ్రయించింది. హైకోర్టులో నిన్న హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక ఈ మోషన్ పిటిషన్ మీద ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ విచారణ చేపట్టనుంది. అయితే ఎన్నికల ఎపిసోడ్ చివరికి ఎన్ని మలుపులు తిరుగుతుంది అనేది ఆసక్తికరంగా మారింది.

ప్రభుత్వం వద్దన్నా ఉద్యోగులు తమ వల్ల కాదన్నా వెనక్కు తగ్గకుండా ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎన్నికల సంఘానికి నిన్న హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వ్యాక్సినేషన్ ప్రక్రియకు అడ్డంకిగా మారుతుంది అనే కారణం చెబుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్మానించింది. దీంతో ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుని డివిజనల్ బెంచ్ లో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం. చివరికి డివిజనల్ బెంచ్ ఏమి తేలుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.  

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news