ప్రైవేటు ల్యాబుల్లో కరోనా టెస్ట్ రేట్లు అధికంగా ఉంటున్నాయని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వచ్చింది. కరోనా టెస్ట్ రేట్లని భారీగా తగ్గించింది. ఆంటిజెన్ సహా ఆర్టీ- పీసీఆర్ టెస్టులకి అటు ప్రైవేటు ల్యాబుల్లోనూ, ఇటు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ తగ్గించింది. ప్రభుత్వ ఆమోదింపబడిన ప్రైవేటు ల్యాబుల్లో యాంటిజెన్ టెస్టుకి 679రూపాయలుగా ధర నిర్ణయించింది. ఇక ఆర్టీ పీసీఆర్ టెస్టుకి రెండు రకాల ధరలున్నాయి.
ప్రభుత్వం వారు శాంపిల్ సేకరించి ప్రైవేటు ల్యాబుకి పంపినట్లయితే 800గా, ప్రైవేట్ వారే శాంపిల్ తీసుకుని టెస్ట్ చేస్తే 900గా నిర్ణయించింది. ఈ ధరలు తక్షణం నుండి అమల్లోకి వస్తాయని ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ సెక్రటరీ అమిత్ సింగ్ తెలియజేసారు. మొత్తానికి కరోనా టెస్టులని ఈ రేంజిలో తగ్గించడం మంచిపనే. కరోనా విస్తరిస్తున్న ఈ సమయంలో టెస్ట్ చేసుకోవడానికి భయపడేవారు, ఇప్పుడు ముందుకు వస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.