తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వివాదాలు ముదురుతున్నాయి. గత కొద్ద రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే. అందులో ఒకటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థించే వర్గంగా ఉంది. మరొక వర్గం రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి తో ఉంది. కాగ ఇప్పటి వరకు లోలోపలే ఉన్న ఈ వివాదం గత కొద్ది రోజుల నుంచి బయటకు వస్తుంది. ఇటీవల పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై అసంతృప్తిగా ఉన్న సీనియర్లు సమావేశం అవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వివాదం బయటకు వచ్చింది.
కాగ ఈ సమావేశానికి వి. హన్మంతరావు నాయకత్వం వహించాడు. కానీ ఈ సమావేశానికి హాజరు అయ్యే సీనియర్లకు అధిష్టానం ఫోన్ చేయడంతో ఈ సమావేశం అర్థంతంగా ముగిసింది. కానీ ఈ సమావేశ ప్రభావం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డి పై చూపింది ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలతో సహా అన్ని బాధ్యతల నుంచి పీసీసీ తప్పించింది.
కాగ ఈ వ్యవహారం పై అధిష్టానానికి ఫిర్యాదు చేచడాని వి. హన్మంతరావు నేడు ఢిల్లీకి వెళ్లారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే ఉండి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరిపై సోనియా గాంధీకి ఫిర్యాదు చేయనున్నారు. కాగ ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. జగ్గారెడ్డి, వి. హన్మంతరావు పై అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నారు.