ఏయూ వేదికగా టీకా మందు తయారీ..!

-

దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. ఈ మహమ్మారికి ఇంకా వ్యాక్సిన్ కనుకోలేదు. ఏపీలో కొవిడ్‌-19కు అవసరమైన టీకా మందు తయారీలో కీలకమైన ప్రయోగ పరీక్షలకు ఆంధ్ర వైద్యకళాశాల వేదిక అయ్యింది. ఏపీలో రెండు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ ప్రయోగాలు నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. తొలిగా భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ ముందుకు వచ్చింది. టీకా ప్రయోగాలకు ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా ఏఎంసీ పిల్లల విభాగాధిపతి డాక్టర్‌ పి.వేణుగోపాల్‌ నియమితులయ్యారు. ఇదే దారిలో ఆక్స్‌ఫర్డ్‌, సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలు ప్రయోగపరీక్షల నిర్వహణకు ఆంధ్ర వైద్యకళాశాలను ఎంపిక చేశాయి.

au
au

దీనికి ప్రిన్సిపల్‌ ఇన్వెస్టిగేటర్‌గా కళాశాల కమ్యూనిటీ మెడిసిన్‌ విభాగాధిపతి డాక్టర్‌ దేవి మాధవిని ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పి.వి.సుధాకర్‌ నియమించారు. ఆమె ఆధ్వర్యంలో ఆక్స్‌ఫర్డ్‌ సంస్థ తరఫున టీకా ప్రయోగ పరీక్షలు జరగనున్నాయి. కళాశాల పరంగా పూర్తిస్థాయిలో సన్నద్ధతతో ఉన్నారు. పరీక్షల నిర్వహణ సమయంలో అవసరమైన సహాయ, సహకారాలు అందించేందుకు వివిధ విభాగాలకు చెందిన పదిమంది ప్రొఫెసర్లలతో సలహా కమిటీ ఏర్పాటైంది. అయితే వైద్యకళాశాలల్లో నిర్వహించే ప్రయోగపరీక్షలకు ఇక నుంచి ఆరోగ్య శాఖ అనుమతిని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ప్రక్రియ వేగంగా పూర్తయితే పరీక్షలు పుంజుకునే అవకాశం ఉందని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news