మనదేశంలో నిత్యం ఏదో ఒక చోట ప్రతి నిమిషానికి ఏదో ఒక రైల్వే ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. అయితే కోవిడ్ లాక్‌డౌన్ వల్ల గత కొంత కాలంగా రోడ్డు ప్రమాదాలే కాదు, రైల్వే ప్రమాదాలు కూడా బాగానే తగ్గాయి. కానీ తాజాగా వడోదర వద్ద జరిగిన ఓ భయానక యాక్సిడెంట్‌ను చూస్తే మాత్రం వెన్నులో వణుకు పుడుతుంది.
వడోదరలోని రనోలి నుంచి బజ్వా వెళ్లే దారిలో ఉన్న కరాచియా అనే రైల్వే యార్డు వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు గేట్ మూసి ఉన్నప్పటికీ దాని గుండా రైల్వే క్రాసింగ్‌పై ప్రయాణిస్తూ వచ్చాడు. అయితే అదే సమయంలో వేగంగా వచ్చిన ఓ రైలు అతన్ని ఢీకొంది. ఢీకొడుతూనే అతన్ని, అతనితోపాటు అతని వాహనాన్ని రైలు ముందుకు లాక్కెళ్లింది. తరువాత పట్టాలపై వాహనం కనిపించలేదు. ఆ వాహనాన్ని, అతన్ని రైలు ఎంత దూరం లాక్కెళ్లిందో కూడా తెలియదు.
ये भयानक तस्वीर वडोदरा में रानोली से बाजवा सेक्शन के बीच करचिया यार्ड की है जब एक ट्रेन एक बाइक सवार को रेलवे क्रॉसिंग पर कुचलती हुई चली गई। गलती बाइक वाले कि ही दिख रही है, फाटक भी बंद दिख रहा है। घटना 21 जून की है पर विडीओ आज सामने आया है। जांच चल रही है। @indiatvnews @niraj707 pic.twitter.com/D4JbkTTt3e
— Nirnay Kapoor (@nirnaykapoor) June 28, 2020
కాగా ఈ సంఘటన గత ఆదివారం జూన్ 21వ తేదీన జరగ్గా అక్కడే అమర్చబడిన సీసీటీవీ కెమెరాలో యాక్సిడెంట్ దృశ్యాలు రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.