రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు మొదలైనట్లు కనిపిస్తోంది. ఒక్కో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే… సీఎం రేవంత్ రెడ్డిపై తిరుగుబాటును చేయడం మొదలు పెడుతున్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మక్తల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ! అంటూ ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీలో రెడ్డిలకే ప్రాధాన్యం అంటూ మక్తల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ లు చేశారు. మక్తల్ ఎలక్ట్రానిక్ మీడియా వాట్సప్ గ్రూపులో కాంగ్రెస్ ఎమ్మెల్యే మెసేజ్ పెట్టారు. ఎంపీ ఎన్నికల ముందు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి ఇస్తామని జన జాతర సభలో ప్రకటించాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు తనకు మంత్రి పదవి దక్కే అవకాశం లేకపోవడంతో తిరుగుబాటు జెండా ఎగరేసిన వాకిటి శ్రీహరి…ఇది ప్రజా పాలనా.. రెడ్డి పాలనా! ఎవని పాలయ్యిందిరో తెలంగాణ! అంటూ ఫైర్ అయ్యారు.
https://x.com/TeluguScribe/status/1809797975419589048