ప్రేమికుల రోజు: మీ రిలేషన్‌షిప్‌ ఇలా ఉందంటే..వారికి గుడ్‌బై చెప్పడం మేలు

-

ఈరోజు ప్రేమికుల రోజు.. సోషల్‌ మీడియా అంతా.. ప్రేమ పండగ అలుముకుంది.. నువ్వు నా లైఫ్‌లో ఉండటం నా అదృష్టం అని కొందరు, మీ స్వీట్‌ హార్ట్‌ అని మరికొందరు..వాళ్ల పార్టనర్స్‌తో స్టేటస్‌లు పెడుతున్నారు. సింగిల్‌గా ఉన్నవాళ్లు ఫన్నీ మీమ్స్‌ చూసుకుంటూ ఎంజాయ్‌ చేస్తున్నారు. కానీ ప్రేమలో విఫలం అయిన వాళ్లు, ప్రేమలో ఉంటూ కూడా ఒంటరితనాన్ని అనుభవిమంచే వాళ్లు మాత్రం ఈరోజు ఇంకా ఎక్కువ బాధపడతారు. మీరు నకిలీ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పడానికి కొన్ని సంకేతాలు ఉంటాయి. ఈరోజు అయినా మీరు భ్రమలోంచి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోండి.

అందుబాటులో లేకపోవడం, మీకు సమస్య ఎదురైనప్పుడు అండగా లేకపోయినా మీరు ఆ బంధం గురించి ఆలోచించాల్సిందే. మీకు అవసరం ఉన్నప్పుడు అందుబాటులో లేకుండా, తనకు టైం ఉన్నప్పుడు, అవసరం ఉన్నప్పుడే కాంటాక్ట్ చేసే వ్యక్తులకు దూరంగా ఉండటం మంచిది. మెసేజులకు, కాల్సు రెస్పాండ్ కాకపోవడం, కాల్ బ్యాక్ చెయ్యకపోవడం వారికి మీపై ఉన్న చులకన భావం, ఈ బంధం అంటే ఉండే నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది.

పట్టించుకోకుండా జోకులు వేయడం. సరదాగా తీసుకోవాల్సిన విషయాలను సీరియస్‌గా తీసుకోవడం వంటివి చేస్తున్నాడంటే మీ భావాలను గౌరవించట్లేదని అర్థం. మీరు రోజుల తరబడి కాల్ చేయకపోయినా పట్టించుకోకపోవడం. మీ ఇష్టాయిష్టాలకు ఏ మాత్రం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం, కావాలనే ఇగ్నోర్ చేయడం, చిన్న విషయాలకు కూడా గొడవ పడటం, ఫ్రెండ్స్ను వదిలేయమని చెప్పడం, ఎక్కువ ఇగో చూపించడం వంటివి కూడా ఒక రిలేషన్లో రెడ్ ఫ్లాగ్ . కాబట్టి తొందరపడి ఒక బంధంలోకి వెళ్లకుండా ఈ విషయాలన్నిటినీ ఆలోచించుకొని ముందడుగు వేయాలి.

ఏదైనా అవసరం ఉంటేనే మీ మీద వారికి ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ట్రై చేస్తారు..అవసరం వచ్చినప్పుడే ప్రేమగా ఉంటారు. మీ లైఫ్‌లో ఏం జరుగుతుందో కూడా వారు పట్టించుకోరు. మిమ్మల్ని మీ కుటుంబం నుంచి స్నేహితుల నుంచి దూరంగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు. మీ జీవితంలో మీరే ఒంటరి అవుతారు.

మీ రిలేషన్‌షిప్‌ ఇలానే ఉందంటే.. వీలైనంత తర్వగా మీరు అందులోంచి బయటకు వచ్చేయండి. ప్రేమికుల రోజు ఒక కొత్త జీవితానికి నాంది పలకండి. వదిలేస్తే వచ్చే బాధ తక్కువే.. అలాంటి వారిని భరించడం వల్ల మీరు లైఫ్‌ అంతా బాధపడతారు.

Read more RELATED
Recommended to you

Latest news