తెలంగాణలో గంజాయి లేకుండా పోలీసులు చర్యలు చేపట్టాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తామంటున్నారని.. అసెంబ్లీకి రాని వారికి అధికారం ఎందుకంటూ వ్యాఖ్యానించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీ స్టేడియంలో జరిగిన 15,750మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి.

డిసెంబర్ 7న ఇదే వేదికలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధి సమక్షంలో ప్రమాణం చేసినపుడు ఎంత ఆనందం కలిగిందో.. నియామక పత్రాలు అందిస్తుంటే.. అంతకంటే ఎక్కువ ఆనందంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. తమకు కుటుంబం అంటే తెలంగాణ ప్రజలని.. పరీక్షలు రాసి ఎదురుచూసి నిరాశకు గురైన వారికి అండగా ఉండాలని కాంగ్రెస్ భావించిందన్నారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ కి నేను ఒక్కటే చెబుతున్న రాష్ట్రంలో గంజాయిని మాట వినిపించకుడదని అన్నారు. ఎంపికైన ప్రతి ఒక్కరూ మనసులో ఒట్టేసుకొండి… గంజాయి పై ఉక్కుపాదం మోపుతామని… డ్రగ్స్ రహిత తెలంగాణగా మారనుంది అన్నారు. నూతనంగా ఎంపికైన కానిస్టేబుల్స్ కు రేవంత్ రెడ్డి కీలక సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news