కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ రాజీనామా వ్యవహారం గత నాలుగైదు రోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఇప్పటికే టీడీపీ ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆయన్ను బుజ్జగించేందుకు పలువురు టీడీపీ నేతలను పురమాయించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. వంశీని నిలుపుకోవడానికి చంద్రబాబు నాయుడు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తదితరులు వంశీని కలిసేందుకు ప్రయత్నాలు చేయగా ఆయన వారికి అందుబాటులోకి రానట్టుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ లీడర్లు వంశీతో చర్చలు జరిపే ప్రయత్నాల్లో ఉండగా.. వారికి వంశీ అందుబాటులో లేరు. చివరకు ఆయన ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఆయన పరారీలో ఉన్నట్టే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
వంశీతో మాట్లాడటానికి తాము ప్రయత్నించినట్టుగా అయితే ఆయన అందుబాటులోకి రాలేదని కేశినేని నాని కూడా ప్రకటించారు. మరి ఈ పరిణామాలను గమనిస్తే.. తెలుగుదేశం పార్టీకి దూరంగా వల్లభనేని వంశీ దూరమైపోతున్నట్టు తెలుస్తోంది. ఇక వంశీ టీడీపీ నేతలకు అందుబాటులోకి లేకపోవడాన్ని బట్టి చూస్తే ఆయన వైసీపీలో చేరేందుకు దాదాపు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టే తెలుస్తోంది.
వంశీ ఇప్పటికే వైసీపీకే చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో టచ్‌లోకి వెళ్లిపోయారు. ముందుగా చంద్రబాబుకు ఆయన రాసిన లేఖలను బట్టి చూస్తే బాబుతో భవిష్యత్తులోనూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే క్రమంలోనే ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు వంశీ వైసీపీ ఎంట్రీని గన్నవరం వైసీపీ ఇన్‌చార్జ్ యార్లగడ్డ వెంకట్రావు వర్గం వ్యతిరేకిస్తోంది.