జగన్ కేబినెట్‌లో ఎవరైనా అదృష్ట వంతులు ఉన్నారా ? అని అంటే.. ఒకే ఒక్కరివైపు అందరి వేళ్తూ చూపి స్తాయి. ఆయనే విశాఖ పట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నుంచి విజయం సాధించిన అవంతి శ్రీనివాస రావు. ఆయన అనుకున్నది సాధించిన అదృష్ట వంతుడుగా ఆయన అనుచరులు పేర్కొంటారు. గతంలో టీడీపీలో అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి.. ఎన్నికలకు ముందు.. అనూహ్యంగా వైసీపీలోకి చేరిపోయారు. తనకు భీమిలి టికెట్ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు తాత్సారం చేయడంతో ఆయన కీలక నిర్ణ యం తీసుకున్నారు.
ఇక, వైసీపీలోకి రావడంతోనే ఆయన భీమిలి టికెట్‌తోపాటు.. ప్రభుత్వం ఏర్పడితే.. మంత్రి పదవి కావాలని అప్పట్లోనే జగన్ ముందు ప్రతిపాదన పెట్టడం, దానికి ఆయన అంగీకరించడం తెలిసిందే. ఇక, ప్రబుత్వం ఏర్పడిన వెంటనే అవంతిని మంత్రి వర్గంలోకి తీసుకున్నారు. సరే! ఇప్పటి వరకు అన్నీ అనుకున్నట్టే జరిగిపోయాయి. అయితే, ఇటీవల రెండు మూడు మాసాలుగా అవంతి జోరు పెంచారు. రాజకీయంగా కామెంట్లతో కుమ్మేస్తున్నారు. ఎవరినీ ఒదిలి పెట్టకుండా ఆయన దులిపి పారేస్తున్నారు. కొన్నాళ్ల కిందట పరోక్షంగా మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును టార్గెట్ చేసిన ఆయన తాజాగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని దూకుడు పెంచారు.
పవన్ చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీ పార్టీని టీడీపీలో కలిపేయాలనుకుంటే కలిపేయం డి.. కానీ టీడీపీకి అద్దె మైక్‌లా మాట్లాడకండి’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించారు. టీడీపీ నేతల అవినితి మీకు ఎందుకు కనిపించడం లేదా అని మంత్రి పవన్‌ను ప్రశ్నించారు. ఇక, గతంలో చంద్రబాబును కూడా ఇలానే ఆయన దులిపి పారేశారు. వాస్తవానికి వైసీపీలో లెక్కకు మిక్కిలిగా ఫైర్ బ్రాండ్లు ఉన్నప్పటికీ.. అవంతి గతంలో ఎప్పుడూ టీడీపీలో ఉన్నసమయంలో ఈ తరహా వ్యాఖ్యలు చేయలేదు. కానీ, ఇప్పుడు ఆయన విపక్ష నాయకులకు కంట్లో నలుసుగా మారిపోయారు.
అయితే, దీనివెనుక ఏదైనా వ్యూహం ఉందా? అని విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. మంత్రి పదవి రెండున్న రేళ్లేనని జగన్ ప్రకటించడంతో దీనిని పదిలం చేసుకునేందుకు అవంతి ప్రయత్నిస్తున్నారా? లేక.. తనకంటూ.. ప్రత్యేకత ఉండాలనే ఉద్దేశంతో ఆయన దూకుడుగా ఉన్నారా? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. నిజానికి అవంతిని దగ్గరగా చూసిన నాయకులు కూడా గతంలో లేని దూకుడు ఇప్పుడు ప్రదర్శిస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి జగన్‌కు దగ్గరవుతున్న కొత్త నేతల్లోఅవంతి తొలి వరుసలో ఉన్నారని అంటున్నారు. మరి ఫ్యూచర్‌లో ఈ యన సీటు పదిలమో.. రెండున్నరేళ్ల రాజానో చూడాలి.