వాసిరెడ్డి పద్మపై వంగలపూడి అనిత సెటైర్లు..

-

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా.. ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కాల్ వ్యవహారంలో విచారణ జరిపాలంటూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాసింది. దీనిపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాసిరెడ్డి పద్మ గతంలో అకారణంగా చంద్రబాబుకు నోటీసులు ఇచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రతిపక్ష నేతను నాకున్న సర్వాధికారాలతో కమిషన్ ముందు హాజరుకమ్మని ఆదేశించాను అన్న ఈవిడి ఇప్పుడు అదే విధంగా తమ పార్టీ డర్టీ ఎంపీని తన ముందు తక్షణమే హాజరుకావాలని అని ఎందుకు అనలేదు? అని అనిత ప్రశ్నించారు వంగలపూడి అనిత.

I'm a Hindu and not Christian, says TDP MLA Anitha after old video goes viral | The News Minute

ఇప్పుడు తమ పార్టీ ఎంపీ అడ్డంగా దొరికిపోయి రాష్ట్రంలో మహిళలంతా ఛీ కొడుతుంటే తీరిగ్గా రెండు రోజుల తర్వాత లేఖ రాశారట అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు వంగలపూడి అనిత. ఇది కచ్చితంగా చిత్తశుద్ధితో చేసిన చర్య కాదంటూ వాసిరెడ్డి పద్మపై నిప్పులు చెరిగారు. జగన్ రెడ్డిని కాపాడేందుకు రాసిన లేఖ ఇది అంటూ అనిత విమర్శించారు వంగలపూడి అనిత. రెండ్రోజులయినా ఇంకా పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించలేదని మహిళలు జగన్ రెడ్డిని ప్రశ్నిస్తుండడంతో కాలయాపన చేయడానికి వేసిన ఎత్తుగడ ఇది అని ఆరోపించారు వంగలపూడి అనిత.

 

Read more RELATED
Recommended to you

Latest news