తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇటీవల మునుగోడు ఎమ్మెల్య కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు భగ్గుమన్నాయి. అయితే.. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా.. కోమటిరెడ్డి సోదరులపై టీ.కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి విమర్శలు చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఎన్నో అవకాలను కల్పించిందని చెప్పారు రాంరెడ్డి దామోదర్. కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎంతో లబ్ధి పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం దారుణమని అన్నారు రాంరెడ్డి దామోదర్.
ఏపీలో కేఏ పాల్, తెలంగాణలో రాజగోపాల్ ఇద్దరూ ఒకటేనని… ఏం మాట్లాడతారో వారికే తెలియదని చెప్పారు రాంరెడ్డి దామోదర్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరూ ఒకే రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని… వెంకటరెడ్డి తీరును చూస్తుంటే ఆయన కూడా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోందని చెప్పారు రాంరెడ్డి దామోదర్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చండూరు సభకు హాజరు కాకుండా… అమిత్ షాను
కలిసేందుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు రాంరెడ్డి దామోదర్.