వంగవీటి ఆన్ ఫీల్డ్…గుడివాడ బరిలో?

-

వంగవీటి రాధా…ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు…రాష్ట్రంలో ఉన్న కాపు సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా ఉండే కుటుంబం వంగవీటిది. రాధా తండ్రి రంగా ఏ విధంగా కాపు వర్గానికి అండగా నిలిచారో అందరికీ తెలిసిందే. రంగా తర్వాత కాపులకు రాధా పెద్ద దిక్కుగా ఉంటున్నారు. కాకపోతే రాజకీయంగా మాత్రం రాధా నిలదొక్కుకోలేకపోతున్నారు. పార్టీలు మారినా సరే ప్రయోజనం ఉండటం లేదు.

మొదట కాంగ్రెస్ నుంచి బరిలో దిగి ఎమ్మెల్యేగా గెలిచారు…ఆ తర్వాత ప్రజారాజ్యంలోకి వెళ్ళి ఓడిపోయారు…నెక్స్ట్ వైసీపీలోకి వచ్చి…ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక చివరికి 2019 ఎన్నికల ముందు రాధా టి‌డి‌పిలోకి వచ్చారు. కానీ టి‌డి‌పి నుంచి రాధా బరిలో దిగలేదు. టి‌డి‌పి గెలుపు కోసం ప్రచారం చేశారు. కానీ ఎన్నికల్లో టి‌డి‌పి ఘోరంగా ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది.

దీంతో రాధా కాస్త రాజకీయాలకు దూరంగా జరిగారు. అప్పుడప్పుడు అమరావతి ఉద్యమంలో కనిపించారు. అయితే ఈ మధ్య రాధా గుడివాడ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అక్కడ తన సామాజికవర్గానికి చెందిన నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాని, రాధాల స్నేహానికి బ్రేక్ పడింది మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. ఏ పార్టీలో ఉన్నా సరే నాని, రాధాలు మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు వారి స్నేహానికి బీటలు పడ్డాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే రాధా గుడివాడ బరిలో నుంచి దిగుతారని ప్రచారం జరుగుతుంది.

నెక్స్ట్ ఎన్నికల్లో రాధా గుడివాడ బరిలో ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. అయితే కొందరేమో రాధా…టి‌డి‌పి నుంచి బరిలో దిగుతారని మాట్లాడుతుంటే, మరికొందరు జనసేన నుంచి బరిలో దిగబోతున్నారని ప్రచారం నడుస్తోంది. మరి చివరికి రాధా ఎక్కడ పోటీ చేస్తారో…ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే విషయంపై మాత్రం క్లారిటీ రావడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version