బ్యాంక్ డిపాజిట్‌దారులకు ఝలక్..!

-

సాధారణంగా అందరం బ్యాంక్ లో డబ్బులని దాచుకుంటూ ఉంటాం. అయితే బ్యాంక్ లో డబ్బులు దాచుకోవడం నిజంగా సురక్షితం. అలానే బ్యాంక్ లో డబ్బులని పెడితే వడ్డీ కూడా వస్తుంది. అయితే బ్యాంక్ లో డబ్బులు దాచుకునే వాళ్ళు ఈ ముఖ్యమైన విషయాలని తెలుసుకోవాలి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

SBI

దేశీ అతి పెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI ఎస్‌బీఐ తాజా నివేదికలో షాకింగ్ విషయం వెలుగు లోకి వచ్చింది. అయితే డిపాజిట్లపై నిజమైన రాబడి రేటు నెగటివ్ రిటర్న్‌గా ఉంది. అంటే డిపాజిట్ల ద్వారా డిపాజిట్‌దారులకు ఎలాంటి లాభం రాదు అని వెల్లడించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి పైగా ఉంది. ఏడాది ఫిక్స్‌డ్ డిపాజిట్లపై FD 5 శాతం కన్నా తక్కువ వడ్డీ వస్తోంది. అంటే నెగటివ్ రిటర్న్ వుంది. ఇది ఇలా ఉంటే అందరు డిపాజిటర్లు కాకపోయిన వడ్డీ ఆదాయంపై జీవించే సీనియర్ సిటిజన్స్‌ విషయంలో మాత్రం కచ్చితంగా పన్ను విధింపును సమీక్షించాలని స్టేట్ బ్యాంక్ అంటోంది.

పన్ను మినహాయింపు పెంచాలని అంది. ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేలకు పైన వడ్డీ ఆదాయాన్ని డిపాజిట్‌దారులకు క్రెడిట్ చేసేటప్పుడు టీడీఎస్ కట్ చేసుకుంటున్నాయి బ్యాంకులు. అదే రూ.50 వేలకు పైన వడ్డీ ఆదాయం ఉంటే టీడీఎస్ కట్ చేసుకుంటున్నారు. పాన్ నెంబర్ ఇస్తే 10 శాతం టీడీఎస్.. లేదంటే 20 శాతం టీడీఎస్ కట్ అవుతుంది. అయితే దేశంలో రిటైల్ డిపాజిట్లు రూ.102 లక్షల కోట్లకు చేరాయట.

Read more RELATED
Recommended to you

Exit mobile version