టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లవర్ బాయ్ సిద్దార్థ్ లు హీరోలుగా తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమా ట్రైలర్ ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇక ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ట్రైలర్ లో డైలాగులు మరియు సన్నివేశాలు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అంతే కాకుండా టెక్నికల్ అంశాలు కూడా భాగునట్టు కనిపిస్తోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.
అంతే కాకుండా రావు రమేష్, జగపతి బాబు లాంటి నటులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నట్టు అర్థం అవుతోంది. ఇక ఆర్ ఎక్స్ 100 లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన అజయ్ భూపతి ఈ సినిమాతో మళ్లీ అలాంటి హిట్ ఇవ్వభోతున్నట్టు ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. అంతే కాకుండా ట్రైలర్ కూడా కాస్త బోల్డ్ గా రోమాంటిక్ సన్నివేశాలతో నిండిపోయింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ లుగా అదితిరావు హైదరీ, అనూ ఇమాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్నో అంచనాల మధ్య వస్తోన్న ఈ చిత్రం ఎలాంటి విజయం అందుకుంటుందో చూడాలి.