పద్మభూషణ్ అందుకోనున్న వాణీ జయరామ్..!

-

సీనియర్ సింగర్ వాణీ జయరామ్ ను పద్మభూషణ్ అవార్డు వరించింది. నేడు రిపబ్లిక్ డే పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సంగీత దర్శకుడు కీరవాణి , నటి రవీనాటాండన్ పద్మశ్రీకి ఎంపిక కాగా.. వాణి జయరామ్ పద్మభూషణ్ కి ఎంపికయ్యారు. వాణీ జయరామ్ తెలుగు, తమిళ్, హిందీ ఇలా అన్ని ప్రధాన భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన మధురమైన పాటలు పాడి శ్రోతలను అలరించారు.

తమిళనాడు వేలూరులో జన్మించిన వాణి జయరామ్ దాదాపు 50 సంవత్సరాలు పైగా సంగీత ప్రియులను తన గాత్రంతో అలరిస్తూ చిన్న వయసులోనే ఆలిండియా రేడియోలో పాటలు పాడుతూ.. తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత కూడా భర్త ప్రోత్సాహంతో గాయనిగా మరింత గుర్తింపు తెచ్చుకుంది. 1975లో మొదటిసారి తమిళ చిత్రం అపూర్వ రాగంగల్ లో పాడిన పాటల గాను ఆమెకు జాతీయ అవార్డు లభించింది. ఆ తర్వాత ఆల్ టైం క్లాసిక్ శంకరాభరణం చిత్రంలో కూడా పలు పాటలు పాడి మరో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది.

ముఖ్యంగా 14 వేల కు పైగా పాటలు పాడిన వాణి జయరామ్ కు మధుర గాయనిగా పద్మభూషణ్ రావడంతో అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి ఆమెను అభినందిస్తూ సోషల్ మీడియా పోస్ట్ చేయడంతో ఇప్పుడు మరింత వైరల్ గా మారింది. తాను గాయనిగా ఇంత క్రేజ్ సంపాదించడానికి కారణం తన భర్త జయరామ్ అని ఆమె చెబుతూ ఉంటుంది. అయితే ఆయన 2018లో మరణించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news