సినిమాలకు రాజకీయాలకు ఏదో అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే అందుకే సినిమాల్లో రాణించిన అందరూ తరువాతి స్టెప్ గా రాజకీయాల వంక చూస్తూ ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ బిజెపి బలపడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు అనేక మంది పాతతరం నటీమణులను కలిసి బీజేపీలో చేరమని కోరుతూ వస్తున్నారు. దాదాపు ఒక ఇరవై రోజుల క్రితం చెన్నై లో వాణి విశ్వనాథ్ అనే అలనాటి హీరోయిన్ తో ఆయన భేటీ అయ్యారు.
ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహించాలని సోము కోరారు.ఈ విషయం మీద ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో జాతీయ నేతల సమక్షంలో ఆమె పార్టీ సభ్యత్వం తీసుకోన్నారని అంటున్నారు. వైసీపీలో రోజాకి పోటీ గా ఈమెను దింపే అవకాశం ఉందని అంటున్నారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఈమెను గట్టిగా రంగంలోకి దింపేందుకు బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నారు.