తెలంగాణలో కొన్ని రోజుల నుంచి టెన్షన్ పెడుతున్న a2 పులి మళ్ళీ వచ్చేసింది. మహారాష్ట్ర వెళ్ళినట్టే వెళ్లి తిరిగి వచ్చిన పులి మహారాష్ట్ర సరిహద్దులోని పెంచికల్ పేట మండలంలోని అడవుల్లో సంచరిస్తున్న ట్లు గుర్తించారు. నిజానికి దీన్ని పట్టుకునేందుకు అటవీశాఖ ఒక పది రోజుల క్రితం పెద్ద ఆపరేషన్ నిర్వహించింది. ఆ సమయంలో మహారాష్ట్ర వైపు వెళ్లిపోయిన ఈ పులి ఇక్కడే ఉన్న రెండు ఆడ పులుల తోడు కోసం మళ్ళీ తిరిగి వచ్చిందని తెలుస్తోంది.
తాజాగా ఇది మూడు పశువులను పొట్టన పెట్టుకుందని నిన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించారు. దీంతో 10 రోజుల క్రితం నిలిపివేసిన ఆపరేషన్ మరలా ప్రారంభిస్తామని మహారాష్ట్ర నుంచి ఈ ఆపరేషన్ కోసం బృందం వల్ల తిరిగి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పులి మానసిక స్థితి దెబ్బతిన్నట్లు కనిపిస్తోందని అధికారులు భావిస్తున్నారు. గతంలో మహారాష్ట్రలో సుమారు 13 మందిని పొట్టనబెట్టుకున్న అవని తరహాలోనే ఈ పులి కూడా ప్రవర్తిస్తోందని చెబుతున్నారు.