పవన్‌కల్యాణ్‌ను వరుణ్‌తేజ్ శత్రువుగా చూస్తున్నాడా…?

పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించాలి. ఏదో ఆడుతూపాడుతూ.. పవర్‌స్టార్ పక్కన కనిపిస్తే చాలదు. పవన్‌కల్యాణ్‌ను శత్రువుగా చూడాలి. అందులోనూ పవర్‌ఫుల్‌ రోల్‌ కావడంతో.. పవర్‌స్టార్‌కు ధీటుగా నటించే హీరో కోసం వెతుకుతున్నారు. మలయాళంలో బీజు మీనన్‌.. పృథ్వీరాజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ ఘన విజయం సాధించింది. దీని రీమేక్‌ రైట్స్‌ను సితార ఎంటర్టైన్‌మెంట్స్‌ దక్కించుకుంది. సాగర్‌ కె చంద్ర దర్శకుడు. ఇందులో పవన్‌ బీజూ మీనన్‌ పోషించిన శక్తిమంతమైన పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను పోషిస్తున్నాడు. పృథ్వీరాజ్‌ రోల్‌ ఎవరు చేస్తారన్న ప్రశ్న పెద్ద క్వశ్చన్‌మార్క్‌గా మారింది.

ఇద్దరు వ్యక్తులు అయ్యప్ప… కోషీ ఇగోల కారణంగా ఒకరంటే మరొకరికి పడదు. శత్రువులుగా మారతారు. ఒకరిపై మరొకరు పైచేయి సాధిస్తూ వుంటారు. ఇద్దరూ తలపడే సీన్స్‌ కూడా వుంటాయి. ఈ క్రమంలో పవన్‌కల్యాణ్‌ను ధీటుగా ఎదుర్కొనే హీరో కావాలి. కోషీగా రానా పేరు వినిపించినా.. హీరో నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాలేదట.

కోశి పాత్రను యువ హీరో నితిన్‌ చేస్తాడని టాక్ నడుస్తున్నా.. అభిమాన హీరోను పవర్‌ఫుల్‌గా ఎదుర్కొంటాడా? అన్న డౌట్‌ చాలామందిలో వుంది. బయట హీరోల బదులు మరో మెగా హీరోనే తీసుకుంటే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా వుందట. గద్దలకొండ గణేష్‌లో గడ్డంతో రఫ్‌గా కనిపించిన వరుణ్‌తేజ్‌ సూట్‌ అయ్యే అవకాశం వుంది. మామయ్యతో కలిసి నటించాలని సాయిధరమ్‌తేజ్ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడు.