జేమ్స్ బాండ్ యాక్టర్ సీన్ కానరీ కన్నుమూత…!

హాలీవుడ్ తొలి ‘జేమ్స్ బాండ్’ నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. స్కాటిష్‌లో జన్మించిన సీన్ కానరీకి జేమ్స్ బాండ్ గా వేలాది మంది అభిమానులున్నారు. ‘జేమ్స్ బాండ్‌’ సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాతో సహా 7సినిమాల్లో నటించి 40 ఏళ్లుగా ‘జేమ్స్ బాండ్’ స్టార్‌గా నిలిచిపోయారు. కానరీకి ప్రస్థుతం 90 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో కానరీ తుదిశ్వాస విడిచినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

సీన్ కానరీ 1999లో పీపుల్స్ మ్యాగజైన్ ‘సెక్సియస్ట్ మేన్ ఆఫ్ ది సెంచరీ’గా ఎంపికయ్యారు. వయసు పెరిగే కొద్దీ ఆయనలోని సెక్స్ అప్పీల్ పెరుగుతూ వస్తోందన్న ప్రశంసలు అందుకున్నారు. ది విండ్ అండ్ ది లైన్, ది మేన్ హు వుడ్ బి కింగ్, ఇండియాన్ జోన్స్ అండ్ ది లాస్ట్ క్రూసేడ్, ది హంట్ ఫర్ రెడ్ అక్టోబర్ వంటి చిత్రాలు ఆయనకు మంచిపేరు తెచ్చాయి. ‘ది అన్ టచబుల్స్’ సినిమాలో నటనకు గాను ఉత్తమ సహాయనటుడు గా ఆస్కార్ గెలుచుకున్నారు.