వాస్తుని అనుసరిస్తే ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది. పైగా అనారోగ్య సమస్యలు ఇంట్లో ఎవరికైనా ఉంటే కూడా వాస్తుని అనుసరించడం మంచిది. దీని వల్ల మంచి కలుగుతుంది.
ఎక్కువ మంది అనారోగ్య సమస్యలతో బాధపడే వారు మానసిక అశాంతితో బాధపడుతూ ఉంటారు. చిరాకు కూడా ఉంటుంది ఇలా కాకుండా మంచిగా ఉండాలంటే వాస్తు పండితులు చెబుతున్న అద్భుతమైన చిట్కాలను అనుసరించండి.
మీయొక్క ఇంటి కిటికీలు తలుపులు ఎప్పుడు మూసేయద్దు. దీని వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి అప్పుడప్పుడు తలుపులు కిటికీలు తెరుస్తూ ఉండండి. అప్పుడు గాలి వెలుతురు బాగా వస్తాయి. పైగా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది.
అలానే బాల్కనీ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి బాల్కనీ ఉంటే బయటకి వచ్చి కూర్చోండి. దీనివల్ల గాలి వెలుతురు తగిలి ఆరోగ్యం బాగుంటుంది పైగా పాజిటివ్ ఎనర్జీ కూడా వచ్చి మంచి వైబ్రేషన్స్ వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది.
ప్రశాంతంగా ఉండాలంటే ఇంట్లో ఒక చోట ఉప్పుని ఉంచండి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది. లేదంటే మీరు స్నానం చేస్తున్నప్పుడు బకెట్ నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి స్నానం చేయండి దీనివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది.