నవీన్ పోలిశెట్టి ఎమోషనల్ ట్వీట్… హీరో అవ్వాలంటే గొప్పవాడు కానక్కరలేదంటూ…

-

జాతిరత్నాలుతో ఒక్కసారిగా ఫుల్‌ క్రేజ్‌ సొంతం చేసుకున్నారు యువ నటుడు నవీన్‌ పొలిశెట్టి. కామెడీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా గతేడాది విడుదలై సూపర్‌హిట్‌ అందుకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ‘సైమా’ అవార్డుల ప్రదానోత్సవంలో ఈ చిత్రానికి విమర్శకుల ఉత్తమ నటుడిగా నవీన్‌ అవార్డు సొంతం చేసుకున్నారు. అల్లు అర్జున్‌, రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు దక్షిణాదికి చెందిన స్టార్‌హీరోహీరోయిన్ల సమక్షంలో అవార్డు అందుకోవడం పట్ల నవీన్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ పెట్టారు.

‘‘సినిమా హీరో కావాలని గొప్ప కలలు కనడానికి మనం గొప్పవాళ్లం కాదు.. చాలా పేదవాళ్లం’ అని చిన్నప్పుడు నాకెంతోమంది చెబుతుండేవారు. ఈరోజు ఆ అబ్బాయే ఉత్తమ నటుడిగా అవార్డు పొందాడు. కష్టాలు, కన్నీళ్లు, ఆకలి రోజులు, నిద్రలేని రాత్రులు ఇలాంటి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటే.. తప్పకుండా కలలు నిజం అవుతాయి’’ అని నవీన్‌ పేర్కొన్నారు. మరోవైపు నటి కృతిశెట్టి సైతం ‘సైమా’ అవార్డు పొందడంపై ట్వీట్‌ పెట్టారు.

‘‘నా వర్క్‌ని గుర్తించి, అవార్డు ఇచ్చి ప్రోత్సహించినందుకు థ్యాంక్యూ సైమా. నాకు ఓటు చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. మీరే నాకు స్ఫూర్తి. కలలు కనండి. వాటిని సాధించడం కోసం ఎక్కువగా కష్టపడండి’’ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘ఉప్పెన’ చిత్రానికి గానూ ఉత్తమ నూతన నటిగా ఈమె అవార్డు సొంతం చేసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news