వాస్తు ప్రకారం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు అయినా సరే తొలగి పోతాయి పాజిటివ్ ఎనర్జీ కలిగి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ సమస్య కలగదు. అయితే ఈ రోజు వాస్తు చిట్కాలు గురించి పండితులు మనతో చెప్పారు మరి ఆ వాస్తు చిట్కాల గురించి మనం ఇప్పుడు చూద్దాం.
వాస్తు ప్రకారం ఇంట్లో ఆనందం కలగాలంటే వాస్తు చిట్కాలను ఫాలో అవుతూ ఉండాలి అని పండితులు అంటున్నారు. వాస్తుని అనుసరిస్తే ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుంది. చాలా మంది ఇళ్లల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. కొంతమంది ఇంట్లో లక్ష్మీ దేవి ఉండదు.
లక్ష్మి దేవి అనుగ్రహం కలగాలన్నా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలన్నా కచ్చితంగా రావి చెట్టు ఉండకూడదని వాస్తు పండితులు అంటున్నారు. ఇంట్లో రావి చెట్టు ఉండడం వల్ల ఇబ్బందులు కలుగుతాయని ధనం ఉండదని అంటున్నారు.
ఇంట్లో రావి చెట్టు కనుక ఉంటే దాన్ని తొలగించడం మంచిది. మట్టి తో పాటు దానిని తీసి మరొక చోట పెట్టండి. ఇలా చేయడం వల్ల వాస్తు సమస్యలు ఉండవు కాబట్టి కచ్చితంగా ఈ చెట్టు మీ ఇంట్లో ఉంచకుండా చూసుకోండి. వాస్తు ప్రకారం శనివారం నాడు ఈ చెట్టును పూజించడం వల్ల శని ప్రభావం మీ మీద పడదు శని దోషం ఉంటే తొలగిపోతుంది.