వాస్తు: ఇంట్లో తాబేలు ఉంటే మంచిదా..? కాదా..?

-

వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వాస్తు ప్రకారం అనుసరిస్తున్నారు. వాస్తు ప్రకారం అనుసరిస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలామంది ఇళ్లల్లో తాబేలుని పెడుతూ ఉంటారు తాబేలుని ఇంట్లో ఉంచడం వలన మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనే విషయాన్ని ఈ రోజు తలుచుకుందాం. ఎక్కువ మంది లో ఈ ప్రశ్న ఉంటుంది తాబేలను నిజంగా ఇంట్లో పెట్టొచ్చా లేదంటే తాబేలు బొమ్మలను ఇంట్లో పెట్టొచ్చా లేదా అనేది.. మరి ఈ సందేహం మీకు కూడా ఉంటే ఇప్పుడే తెలుసుకోండి.

అయితే నిజంగా తాబేలుని అసలు ఇంట్లో ఉంచుకోకూడదు ఎందుకంటే ఏదైనా పక్షిని కానీ జంతువుని కానీ అలా మనం ఉంచేయకూడదు. మనకి అలా బంధించే అధికారం కూడా లేదు ఏ జీవులని కూడా బంధించకూడదు. అలా ఇంట్లో తాబేలు పెడితే నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఒకవేళ కనుక మీరు ఇంట్లో తాబేలుని పెట్టుకోవాలంటే చెక్కతో లేదంటే క్రిస్టల్ తో మెటల్ తో చేసిన వాటిని పెట్టుకోవచ్చు.

వాస్తు శాస్త్రం ప్రకారం శుక్రవారం గురువారం బుధవారం తాబేళ్లను కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకోవడానికి మంచిది. ఇంట్లో తాబేలు విగ్రహాలు లేదంటే ఫోటోలు ఉండడం వలన ఎంతో మేలు కలుగుతుంది. ఉత్తరం వైపు క్రిస్టల్ తాబేలు లేదంటే ఇతర మెటల్స్ తో చేసిన తాబేలు పెడితే మేలు జరుగుతుంది కెరియర్ బాగుంటుంది. ఇంటి ముఖద్వారం దగ్గర పెడితే కూడా ఎంతో మేలు కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. చాలా మంది లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ తాబేళ్లను ఇంట్లో పెట్టుకుంటే చక్కటి లాభాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news