చాలా మంది వాస్తు ని ఫాలో అవుతూ వుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటే ఏ బాధా ఉండదు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం మంచిది. అలానే వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు మనకి డబ్బులకి సంబంధించిన కొన్ని విషయాలను చెప్పారు. మరి వాటి కోసం ఈరోజు తెలుసుకుందాం.
వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బులు ఖర్చు అయిపోకుండా మీ దగ్గర నిలకడగా ఉండాలంటే ఈ టిప్స్ ని అనుసరించండి. ఇలా చేయడం వలన సమస్యలు తొలగిపోతాయి. వాస్తు శాస్త్రం ప్రకారం పర్సు లో డబ్బులు ఉండాలన్నా ఖర్చు అయ్యిపోకుండా ఉండాలన్న ఇవి బాగా ఉపయోగపడతాయి. పైగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది.
మీ పర్సు లో లక్ష్మీదేవి ఫోటోని పెట్టడం వలన లక్ష్మీ దేవి మీ ఇంట్లో ఉంటుంది.
కొన్ని అక్షింతలని మీరు మీ పర్సు లో పెట్టుకోవడం వలన కూడా డబ్బులు ఖర్చు అయిపోకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు.
మీ పర్సు లో గోల్డ్ లేదా సిల్వర్ కాయిన్స్ ని పెట్టడం వలన కూడా డబ్బులు మీ దగ్గర ఉంటాయి.
ఎర్రటి కాగితాన్ని కానీ క్లాత్ ని కానీ పర్సులో ఉంచడం వలన కూడా లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తుంది.
గోమతి చక్రాన్ని కూడా మీరు మీ పర్సు లో ఉంచుకోవచ్చు. వీటిని ఉంచితే డబ్బులు మీ దగ్గర ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉండవు.